- రూ. 6.50 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లభ్యం
- స్పెషల్ కురో ఎడిషన్ లో కూడా లభ్యం
అక్టోబర్ 10, 2023న లాంచ్ కాగా, నిసాన్ ఇండియా మాగ్నైట్ ఎఎంటి ప్రారంభ ధరల ఆఫర్ ను పొడిగించింది. ఇది రూ. 6.50 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూం)తో అందుబాటులో ఉండగా, దీనిని XE, XL, XV, మరియుXV అనే ప్రేమియం వేరియంట్స్ లో పొందవచ్చు.
మాగ్నైట్ ఎఎంటిలో ఉన్న పవర్డ్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 71bhp మరియు96Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఏఆర్ఏఐ టెస్ట్ సైకిల్ ద్వారా క్లెయిమ్ చేయబడిన 19.70 కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుంది. అదే విధంగా కొత్త గేర్ బాక్స్ తో, డ్యూయల్ డ్రైవ్ మోడ్స్ మరియు క్రీప్ ఫంక్షన్ నుండి మాగ్నైట్ కు బెనిఫిట్స్ లభించనున్నాయి.
నిసాన్ మాగ్నైట్ రెనాల్ట్ కైగర్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మరియు మారుతి సుజుకి బ్రెజా వంటి వాటితో పోటీ పడుతుంది.
మాగ్నైట్ కురో ఎడిషన్ బయట మరియు లోపల బ్లాక్ థీమ్‌తో ఉండగా, రెడ్ బ్రేక్ కాలిపర్స్ తో కూడిన గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, 'కురో ఎడిషన్' బ్యాడ్జ్ మరియు బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ ను కూడా కలిగి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్