- రూ. 6లక్షలతో ప్రారంభమైన ధరలు
- ‘నిస్సాన్ వన్’ వెబ్ ప్లాట్‌ఫారమ్‌ని పరిచయం చేసిన బ్రాండ్
నిస్సాన్ ఇండియా అమ్మకానికి సిద్ధంగా ఉన్నతన ఏకైక ఎస్‌యువి మాగ్నైట్‌తో ఒక కీలక మైలురాయిని సాధించింది. జపనీస్ ఆటోమేకర్ ఇండియాలో 1 లక్ష యూనిట్ల మాగ్నైట్ అమ్మకాలను విజయవంతంగా నమోదు చేసింది. దీనితో పాటుగా, ఈ బ్రాండ్ ‘నిస్సాన్ వన్’ వెబ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా పరిచయం చేసింది.
ఇండియాలో మాగ్నైట్ ఎస్‌యువి 2020లో లాంచ్ అయిన తర్వాత సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యువి ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. ఇది రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అలాగే, ఈ మోడల్లాంచ్ అయినప్పటి నుండి, ఇండియన్ మార్కెట్లో జపనీస్ కార్‌మేకర్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఇది రూ. 6 లక్షలు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లిస్ట్ చేయబడింది.
అంతేకాకుండా, ఈ కీలక మైలురాయిని ప్రత్యేకంగాజరుపుకొనుటకు, నిస్సాన్ 'నిస్సాన్ వన్' అనే కొత్త వెబ్ బేస్డ్ వన్-స్టాప్ ప్లాట్ ఫారమ్‌ను పరిచయం చేసింది. దీనిలో భాగంగా, ఇప్పటికే ఉన్నకస్టమర్ మరియు కొత్త కస్టమర్‌లు టెస్ట్ డ్రైవ్ రిక్వెస్ట్, వెహికల్ బుకింగ్, రియల్ టైమ్ సర్వీస్ రిక్వెస్ట్ మరియు బుకింగ్, రిఫరల్ ప్రోగ్రామ్‌లు మరియు మరిన్ని అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప