- 3 వేరియంట్స్ లోలభ్యం
- అందుబాటులో ఉన్న ఒకే పవర్‌ట్రెయిన్ ఆప్షన్
గత నెలలో నిస్సాన్ ఇండియా దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎఎంటి వెర్షన్ మాగ్నైట్‌ను రూ.6,49,900 (ఎక్స్-షోరూమ్)తో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఆటోమేకర్ ఈ మోడల్‌ను దక్షిణాఫ్రికాలో కూడా 234,900 ర్యాండ్స్ ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 10,36,912 రూపాయలు అన్నమాట. ఇది ఎఎంటి వెర్షన్ మాన్యువల్ వేరియంట్ కంటే 16,000 ర్యాండ్స్ ప్రీమియం ధరతో, విసియా, అసెంటా మరియు టాప్-స్పెక్ అసెంటా ప్లస్ అనే 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
ఫీచర్ల పరంగా చూస్తే, బేస్ విసియా వేరియంట్ లో 16-ఇంచ్ స్టీల్ రిమ్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో 2-డిఐఎన్ ఆడియో సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ను పొందవచ్చు. మరోవైపు, అసెంటా వేరియంట్‌లో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఉన్నాయి. అదేవిధంగా, టాప్-స్పెక్ అసెంటా ప్లస్ వేరియంట్స్ లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టిపిఎంఎస్ మరియు ఇంటెలిజెంట్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.
హుడ్ కింద 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 3-సిలిండర్ పెట్రోల్ మిల్ ఉండగా, ఇది 71bhp మరియు 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ ఎఎంటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది ఈ సెటప్‌తో, కారు ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ 19.7కేఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ రేంజ్ ని అందిస్తుంది.