- రూ.12.08 లక్షలతో ధరలు ప్రారంభం
- హోండా సిటీలో జతచేయబడిన మరిన్ని కొత్త సేఫ్టీ ఫీచర్స్
హోండా కార్స్ ఇండియా తన మొత్తం పోర్ట్‌ఫోలియో మోడల్స్ ని అదనపు సేఫ్టీ ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. అప్‌డేట్ లో భాగంగా , ఆటోమేకర్ తన లైనప్ ధరలను కూడా పెంచింది, ఇందులో అమేజ్, సిటీ, సిటీ e: HEV మరియు ఎలివేట్ ఉన్నాయి.హోండా సిటీ సెడాన్ ధర రూ. 37,200 వరకు పెరగడంతో ఇప్పుడు దీనిని రూ. 12.08 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు.
హోండా సిటీ SV, V- ఎలిగెంట్, V, VX మరియు ZX అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర పెంపు విషయానికొస్తే, ఎంచుకున్న వేరియంట్ ని బట్టి పాపులర్ సెడాన్ ధర ఇప్పుడు రూ.37,200 వరకు పెరిగింది.వేరియంట్ వారీగా హోండా సిటీ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద లిస్ట్ చేయబడ్డాయి.
వేరియంట్స్ | పాత ధరలు | కొత్త ధరలు | తేడాలు |
SV ఎంటి | రూ. 11,70,900 | రూ. 12,08,100 | రూ. 37,200 |
V ఎంటి | రూ. 12,58,900 | రూ. 12,85,000 | రూ. 26,100 |
V-ఎలిగెంట్ ఎంటి | రూ. 12,65,400 | - | - |
VX ఎంటి | రూ. 13,70,900 | రూ. 13,92,000 | రూ. 21,100 |
V సివిటి | రూ. 13,83,900 | రూ. 14,10,000 | రూ. 26,100 |
V-ఎలిగెంట్ సివిటి | రూ. 13,90,400 | - | - |
ZX ఎంటి | రూ. 14,93,900 | రూ. 15,10,000 | రూ. 16,100 |
VX సివిటి | రూ. 14,95,900 | రూ. 15,17,000 | రూ. 21,100 |
ZX సివిటి | రూ. 16,18,900 | రూ. 16,35,000 | రూ. 16,100 |
ధరల అప్‌డేట్ తో, సిటీ సెడాన్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్స్ ని స్టాండర్డ్‌గా పొందగా, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్స్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ 4.2-ఇంచ్ కలర్ డిస్‌ప్లే, 8-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు వెనుక సన్‌షేడ్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంది.
5వ జనరేషన్ హోండా సిటీ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.ఈ ఇంజిన్ మాక్సిమం 119bhp మరియు 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప