- పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్‌ట్రెయిన్ రెండింట్లో లభించనున్నమోడల్
- కొత్త అల్లాయ్ వీల్స్ తో ట్వీక్డ్ ఫ్రంట్ ఫాసియాను పొందిన కొత్త మోడల్
టయోటా ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా మారుతి సుజుకి ఫ్రాంక్స్ బేస్డ్ క్రాస్‌ఓవర్, టైజర్‌ను టీజ్ చేసింది . ఈ మోడల్ 2024 ఏప్రిల్, 3వ తేదీన ఇండియాలో అరంగేట్రం చేయనుంది, తర్వాత మరికొన్ని నెలల్లో దీని ధర ప్రకటించబడుతుంది.
చిత్రంలో చూసినట్లుగా, టయోటా టైజర్ కొత్త ఎల్ఈడీ డిఆర్ఎల్స్ మరియు రీడిజైన్ చేయబడిన గ్రిల్ రెడ్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది . దీని ముందు భాగంలో, మారుతిని తలపించేలా వేరుగా కనిపించడానికి, టైజర్ లో రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్ ఫీచర్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన టెయిల్‌ల్యాంప్స్ మరియు ప్రొఫైల్‌తో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, టైజర్ లిస్ట్ ఫ్రాంక్స్ వలె ఫీచర్-రిచ్‌గా ఉంటుంది. ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు యాంబియంట్ లైటింగ్‌తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో రానుంది . అంతేకాకుండా, క్యాబిన్ మారుతి ఫ్రాంక్స్‌తో పోలిస్తే ఈ కొత్త థీమ్ మరియు వేరుగా అప్హోల్స్టరీ రూపంలో మార్పులను పొందే అవకాశం ఉంది.
మెకానికల్‍గా, టైజర్ ఫ్రాంక్స్ వలె అదే పవర్‌ట్రెయిన్‌తో కొనసాగుతుంది. అయినప్పటికీ, టైజర్ సిఎన్‍జి ఆప్షన్ తో పాటు నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ తో మాత్రమే అందించబడుతుందని మేము అంచనా వేస్తున్నాం. లాంచ్ తర్వాత, టయోటా టైజర్ మారుతి ఫ్రాంక్స్, మహీంద్రా XUV300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, కియా కిగర్, మహీంద్రా XUV300 మరియు సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప