- యాక్సెసరైజ్డ్ వెర్షన్ లో వస్తున్న ఫార్చూనర్
- ఇప్పుడుడీలర్ల వద్ద అందుబాటులో ఉన్న ధర
టయోటా ఇటీవల ఫార్చూనర్ లీడర్ ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. డీలర్‌షిప్ వద్ద కస్టమర్లకు అవసరానికి అనుగుణంగా అమర్చిన పరికరాలపై దీని ధర ఆధారపడి ఉంటుంది. ఇది స్టాండర్డ్ వెర్షన్ నుండి ప్రత్యేకంగా కనిపించే అప్‍డేటెడ్ వేరియంట్ మొదటి టాప్-5 ఫీచర్లు ఇక్కడ మనం చూద్దాం.
డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్
లీడర్ ఎడిషన్ బ్లాక్ రూఫ్‌ను కలిగి ఉండడం ద్వారా ఫార్చూనర్ కు డ్యూయల్ టోన్ రూపాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, ఇది సూపర్ వైట్, ప్లాటినం పెరల్ వైట్ మరియు సిల్వర్ మెటాలిక్ వంటి మూడు ఎక్స్‌టీరియర్ బాడీ పెయింట్ ఆప్షన్స్ లోకూడా అందించబడుతుంది.
బంపర్ స్పాయిలర్స్/ఎక్స్‌టెండర్స్
స్పెషల్ ఎడిషన్ మరింత ఆకర్షణీయమైన రూపాన్ని పొందేందుకు ఫ్రంట్ మరియు రియర్ బంపర్ స్పాయిలర్స్ మరియు ఎక్స్‌టెండర్‌లతో కూడా కలిగి ఉంది. ఉపకరణాలు టిటిఐపిఎల్ ద్వారా అభివృద్ధి చేయబడ్డ అధికారిక డీలర్లచే ఇన్‌స్టాల్ చేయబడతాయి.
బ్లాక్ అల్లాయ్స్
ఇంకా, కన్వెన్షనల్ సిల్వర్ –కలర్డ్ అల్లాయ్స్ బదులుగా, ఫార్చూనర్లీడర్ ఎడిషన్ వెర్షన్ బ్లాక్ -కలర్ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేయవచ్చు.
వైర్లెస్ ఛార్జర్
ఈ స్పెషల్ ఎడిషన్ కోసం వివిధ ఆప్షనల్ యాక్సెసరీస్ మాత్రమే కాకుండా స్టాండర్డ్ గా అందించబడిన వైర్‌లెస్ ఛార్జర్ నుండి కూడా కొనుగోలుదారులు బెనిఫిట్ ను పొందుతారు.
టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్)
స్టాండర్డ్ పరికరాలలో మరొక కీలకమైన భాగంగా టిపిఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఉంది, ఇది ఎస్‌యువిలో ఉపయోగకరమైన లేదా కీలక యాక్సెసరీగా ఉంది.
టయోటా ఫార్చూనర్లీడర్ ఎడిషన్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్
ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ 201bhp మరియు 420Nm (ఎంటి) లేదా 500Nm (ఏటీ) టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది. ఈ మోడల్ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.కాకపోతే, ఇది 4x4 ఆప్షన్ నుపొందదు కానీ, ఇది 4x2 రూపంలో మాత్రమే అందించబడుతుంది.