- పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో రానున్న కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్స్
- రూ. 7.99 లక్షలు నుంచి వీటి ధరలు ప్రారంభం
మహీంద్రా XUV 3XOరూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతోలాంచ్ అయిన తర్వాత టాటా మోటార్స్ దాని దూకుడును పెంచింది. టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‍యూవీ కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లను పరిచయం చేసి పోటీగా ఉన్నXUV 3XOని ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. పాపులర్ కాంపాక్ట్ ఎస్‍యూవీ రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో కొత్త బేస్-స్పెక్ స్మార్ట్ (O) పెట్రోల్ వేరియంట్ ని అందుకోనుంది.
అదే విధంగా, డీజిల్-బేస్డ్ నెక్సాన్ కారు ఇప్పుడురెండు కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లను కూడా పొందనుంది, అవి స్మార్ట్+ మరియు స్మార్ట్+ S. వీటి ధరలు వరుసగా రూ. 9.99 లక్షలు మరియు రూ. 10.59 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. అదనంగా, పెట్రోల్-టైప్ లోని స్మార్ట్+ మరియు స్మార్ట్+ S వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 31,000 మరియు రూ. 41,000 తగ్గనున్నాయి, ఫలితంగా వీటి కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 8.89 లక్షలు మరియు రూ.9.39 లక్షలు నుంచి ప్రారంభమవుతాయి.
ఫీచర్ల విషయానికొస్తే, నెక్సాన్ కొత్త ఎంట్రీ-లెవల్ పెట్రోల్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‍పీ, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీడీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, డ్రైవ్ మోడ్స్, ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు రివర్సర్ పార్కింగ్ సెన్సార్లు ఉండనున్నాయి.
మెకానికల్ గా, టాటా నెక్సాన్ ని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. మొదటి ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 113bhp మరియు 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఎఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్