- 4 వేరియంట్లు, 7 ఎక్స్‌టీరియర్ కలర్లలో అందించబడుతున్న మోడల్
- ఇండియాలో రూ.15.49 లక్షల నుండి ధరలు ప్రారంభం
టాటా మోటార్స్ హారియర్ ఎస్‍యూవీ యొక్క లేటెస్ట్ ఇటరేషన్ ని ఇండియన్ మార్కెట్లో అక్టోబరు-2023లో ప్రవేశపెట్టింది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇంతకు ముందున్న దానితో పోలిస్తే ఇది పూర్తిగా ఒక కొత్త గుర్తింపును కలిగి ఉండడంతో ఎస్‍యూవీలను కొనుగోలు చేసే వారి మధ్య మరింత పాపులర్ గా మారింది. దీంతో, దీనిపై కొంతవరకు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండడం మొదలయ్యింది. ఇప్పుడు మనం ఫ్లాగ్ షిప్ ఎస్‍యూవీపై ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకుందాం.
ఇప్పటి వరకు, అప్‍డేటెడ్ హారియర్ పై బుకింగ్ చేసిన తేదీ నుంచి 3 నుంచి 6 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇక్కడ తెలుసుకునే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రాంతం, డీలర్షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర అంశాలను బట్టి ఈ కాలవ్యవధి మారే అవకాశం ఉంది.ఆసక్తి కలిగిన కస్టమర్లు మీ ఇష్టానికి అనుగుణంగా నిర్దిష్టమైన టైమ్‌లైన్‌ను తెలుసుకోవడానికి మీకు సమీపంలో ఉన్న అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించగలరు.
2023 టాటా హారియర్ యొక్క 2.0-లీటర్ బిఎస్-6 ఫేజ్ 2-కంప్లైంట్ డీజిల్ ఇంజిన్ 170bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ నిర్వహించబడి వరుసగా 16.8కెఎంపిఎల్ మరియు 14.6కెఎంపిఎల్ క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్