- 5 మరియు 7 సీట్స్ లేఅవుట్‌లో లభించనున్న నిస్సాన్ ఎస్‌యువి
- ట్రైబర్ వెర్షన్‌పై కూడా తన పనిని కొనసాగిస్తున్న బ్రాండ్
నిస్సాన్ ఇండియా వచ్చే సంవత్సరంలో తమ లైనప్ లోని కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ప్రస్తుతం జపనీస్ మేకర్ మాగ్నైట్ ఎస్‌యువి పై మాత్రమే విక్రయిస్తుండగా, బ్రాండ్ ఈ సంవత్సరం ఫేస్‌లిఫ్ట్ పై కూడా తన పనిని కొనసాగిస్తున్నది. ఇప్పుడు, రెనాల్ట్-నిస్సాన్ అలయెన్స్ లో, ఈ ఆటోమేకర్ ఫ్రెంచ్ ఆటోమేకర్ ద్వారా నాలుగు కొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. వీటిలో, రెండు 5 సీట్స్ ఎస్‌యువిస్ కాగా, మిగిలిన రెండు 7 సీట్స్ వెర్షన్‌లు.
రెనాల్ట్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో కొత్త-జెన్ డస్టర్‌ను ఆవిష్కరించింది. ఇండియా-స్పెసిఫిక్ మోడల్ త్వరలోనే ఇండియాలో అధికారికంగా ప్రవేశించనుంది. అదనంగా, స్టాండర్డ్ ఫైవ్-సీటర్ వెర్షన్ కాకుండా,, ఈమోడల్ సెవెన్-సీటర్ లేఅవుట్‌లో కూడా అందించబడనుంది. ఇప్పుడు, 2013లో రెనాల్ట్ డస్టర్-నిస్సాన్ టెర్రానో సంయుక్తంగా అందించి నమాదిరిగానే, కొత్త-జెన్ డస్టర్కూడా రీబ్యాడ్జ్ చేయబడిననిస్సాన్ ఎస్‌యువిగా రానుంది.
రెనాల్ట్ లైనప్‌లో మోస్ట్ పాపులర్ మోడళ్లలో ఒకటైన రెనాల్ట్ ట్రైబర్ వచ్చే ఏడాది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో రానుంది. అదనంగా, ప్రారంభంలో, నిస్సాన్ ఇండియా ట్రైబర్‌ను రీబ్యాడ్జ్ చేసి, దాని పేరును కొత్త ఎంపివిగా మార్కెట్ లో పరిచయం చేయనుంది. అయితే తాజా సమావేశంలో ఈ బ్రాండ్ దాని గురించి ఇంకా ప్రస్తావించలేదు.
నిస్సాన్ ఇండియా ఈ సంవత్సరం మొదటగా మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను లాంచ్ చేయనుంది. తరువాత వచ్చే సంవత్సరంలో ఇతర రెనాల్ట్ రీబ్యాడ్జ్డ్ మోడళ్లను లాంచ్ చేయనుంది. ఇటీవలే, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అధికారిక అరంగేట్రానికి ముందే రోడ్ టెస్టింగ్ చేస్తూ మొదటిసారిగా కనిపించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప