గత నెలలో 2023 జపాన్ మొబిలిటీ షోలో మారుతి స్విఫ్ట్ యొక్క లేటెస్ట్ జనరేషన్ ను ప్రదర్శించగా, అందులో దీనికి సంబంధించిన ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఫోర్త్-జెన్ స్విఫ్ట్ 2024 మధ్యలో ఇండియాకు వచ్చే అవకాశం ఉండగా, ఇప్పటికే మన దేశంలో ఈ మోడల్ ను టెస్టింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఆర్టికల్ లో మనం ప్రస్తుతం మోడల్ లో మరియు ఆల్-న్యూ స్విఫ్ట్ లో మోడల్ లోని ఇంటీరియర్ లో ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందాం.
ఓల్డ్ స్విఫ్ట్ ఇంటీరియర్
ఇంతకు ముందు జనరేషన్ లో వచ్చిన మారుతి స్విఫ్ట్ 2018లో అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో, ఈ హ్యచ్ బ్యాక్ యొక్క క్యాబిన్ లో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 6 స్పీకర్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, సెన్సార్స్ తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, కీలెస్ స్టార్ట్/స్టాప్ బటన్, డీఫాగర్‌తో కూడిన రియర్ వైపర్, డీఆర్ఎల్స్ తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే,క్యాబిన్ డార్క్ ఫ్యాబ్రిక్ సీట్ అప్హోల్ స్టరీతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్ ను కలిగి ఉంది.
న్యూ స్విఫ్ట్ ఇంటీరియర్
న్యూ-జెన్ స్విఫ్ట్, సుజుకి తన కొత్త మోడల్స్ అయిన బాలెనో మరియు ఫ్రాంక్స్ వంటి హ్యాచ్‌బ్యాక్స్ కు సరిపోయేలా అద్బుతమైన క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇంకా లోపల ఉన్న అతిపెద్ద హైలైట్ అంశం ఏమిటంటే, ఫ్రీ-స్టాండింగ్ 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో రీవర్క్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ మరియు రీడిజైన్ చేయబడిన ఎయిర్‌కాన్ ప్యానెల్ మరియు వెంట్స్ అని చెప్పవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే, ఫోర్త్-జెన్ స్విఫ్ట్ లో డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ వైట్ థీమ్, కొత్త అప్హోల్స్టరీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, రియర్ ఏసీ వెంట్స్, కొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ స్టార్ట్-స్టాప్ బటన్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కొత్త స్విఫ్ట్ హెడ్-అప్ డిస్‌ప్లేతో కూడా వస్తుందని మేము అంచనా వేస్తున్నాము.
ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, రాబోయే స్విఫ్ట్ కొత్త పవర్డ్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో మరింత అద్బుతమైన పెర్ఫార్మెన్స్ మరియు ఎఫిషియన్సీని ఇవ్వనుంది. గ్లోబల్ మార్కెట్లో సివిటి గేర్ బాక్స్ తో వస్తుండగా, ఇండియా-స్పెక్ స్విఫ్ట్ మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటి యూనిట్ తో వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్