- eVX వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా
- మారుతి నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ఇదే
మారుతి సుజుకి 2025 ప్రారంభంలో దీనిని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా, దాని కంటే ముందే eVX పై టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. వెబ్ లో లీక్ అయిన కొత్త స్పై షాట్‌లు అప్‍కమింగ్ హ్యుందాయ్ క్రెటా ఈవీతో పోటీగా ఉన్న ఈ మోడల్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను వెల్లడించాయి.
స్పై షాట్‌లలో చూసినట్లుగా, మారుతి eVX ప్రస్తుతం అందించబడుతున్న వాటితో చూస్తే పెద్ద డిపార్చర్ ఇంటీరియర్‌ను పొందుతుంది. ఇందులో గుర్తించదగిన అంశాలు ఏమిటంటే, న్యూ టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్రైవ్ మోడ్‌ల కోసం రోటరీ డయల్, న్యూ ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఇంటీరియర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం వంటివి ఉంటాయి.
లోపలి భాగంలో, మారుతి నుంచి అందించబడుతున్న మొదటి ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ కొత్త అల్లాయ్ వీల్స్, సి పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లను పొందుతుంది.
మారుతి సుజుకి న్యూ eVX కి సంబంధించిపూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్ల వివరాలు ప్రస్తుతానికి మారుతి వెల్లడించలేదు. మాకు తెలిసిన విషయమేమిటంటే, ఈ మోడల్ 60kWh బ్యాటరీ ప్యాక్‌ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి రానుందనిదీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 550కిమీల రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప