- ఇండియా నుంచి జపాన్‌కు ఎగుమతి కానున్న రెండో కారు
- మాక్సిమమ్ 500కిమీ డ్రైవింగ్ రేంజ్ ని అందించనున్న eVx
మారుతి eVX, ఈ సంవత్సరం చివరిలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది, ఇది ఇండియా నుండిసొంత దేశమైన జపాన్‌లోని సుజుకి హోమ్ మార్కెట్‌కు ఎగుమతి చేయబడుతున్న రెండవ కారు. జపనీస్ ఆటోమేకర్ కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా యూరప్ మరియు గల్ఫ్ ప్రాంతంలలో అంతర్జాతీయ మార్కెట్లలోకూడా గుజరాత్ ప్లాంట్ ద్వారా eVX ను ఉత్పత్తి చేయనుంది.
విదేశాలకు వెళ్లే ముందు ఇండియాలో eVXలాంచ్ గురించి ముందుగా ఊహించిన దానిలా కాకుండా, దాని కంటే త్వరగా నిర్ధారించడానికి ఇది వివిధ మార్కెట్లలో కూడా లాంచ్ కానుంది. ఈవీ గేమ్‌లోకి మారుతి కొంచెం ఆలస్యంగా చేరుకున్నా దాని ప్రయత్నాలను వేగవంతం చేయడానికి మరింత వేగంతో పని చేస్తుంది. eVX లాంచ్ టయోటా మోడల్‌కు కూడా దారి తీస్తుంది, ఇది టయోటా అర్బన్ స్పోర్ట్ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ ను లాంచ్ చేయనుంది. దీన్ని కూడా గుజరాత్ ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.
2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన మారుతి eVX అదే సంవత్సరం అక్టోబర్‌లో జపనీస్ మొబిలిటీ షోలో మళ్లీ ప్రదర్శించబడింది, eVX మారుతి నుంచి వస్తున్న మొదటి ఈవీ కార్ కానుంది. ఇది 4.3 నుండి 4.5 మీటర్ల పొడవు ఉంటుండగా, 500 కిమీ రేంజ్ తో అందించబడుతుంది. అలాగే, ఈ మోడల్టాటా హారియర్ఈవీ, మహీంద్రా XUV.e8, హోండా ఎలివేట్ ఈవీ మరియు నెక్స్ట్-జెన్ ఎంజి ZS ఈవీలతో పోటీ పడుతుందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప