- భారీ మార్పులను పొందిన థార్ ఎర్త్ ఎడిషన్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్
- టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ వేరియంట్ ఆధారంగా వచ్చిన మోడల్
మహీంద్రా & మహీంద్రా తాజాగా దాని లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ అయిన థార్ ఎర్త్ ఎడిషన్ అనే ఒక కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ ఎడిషన్ థార్ డెజర్ట్ ఆధారంగా మహీంద్రా తీసుకురాగా, ఇది కేవలం టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ వేరియంట్లో పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ ఆర్టికల్ లో, మేము ఇండియాలోని టాప్-10 సిటీల్లో థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
సిటీ | ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎంటి | ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ ఎటి | ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎంటి | ఎర్త్ ఎడిషన్ డీజిల్ ఎటి |
ముంబై | రూ.18.49 లక్షలు | రూ.20.35 లక్షలు | రూ.19.49 లక్షలు | రూ.21.42 లక్షలు |
ఢిల్లీ | రూ.18.18 లక్షలు | రూ.20.01 లక్షలు | రూ.19.24 లక్షలు | రూ.21.15 లక్షలు |
చెన్నై | రూ.19.39 లక్షలు | రూ.21.34 లక్షలు | రూ.20.11 లక్షలు | రూ.22.09 లక్షలు |
కోల్ కతా | రూ.18.14 లక్షలు | రూ.19.97 లక్షలు | రూ.18.80 లక్షలు | రూ.20.67 లక్షలు |
బెంగళూరు | రూ.19.23 లక్షలు | రూ.21.17 లక్షలు | రూ.19.94 లక్షలు | రూ.21.91 లక్షలు |
హైదరాబాద్ | రూ.19.22 లక్షలు | రూ.21.16 లక్షలు | రూ.19.93 లక్షలు | రూ.21.90 లక్షలు |
అహ్మదాబాద్ | రూ.17.22 లక్షలు | రూ.18.95 లక్షలు | రూ.17.93 లక్షలు | రూ.19.98 లక్షలు |
పూణే | రూ.18.49 లక్షలు | రూ.20.35 లక్షలు | రూ.19.49 లక్షలు | రూ.21.42 లక్షలు |
విజయవాడ | రూ.17.45 లక్షలు | రూ.18.71 లక్షలు | రూ.19.90 లక్షలు | రూ.21.87 లక్షలు |
కొచ్చి | రూ.19.20 లక్షలు | రూ.21.14 లక్షలు | రూ.19.91 లక్షలు | రూ.21.88 లక్షలు |
ఈ ఎర్త్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్ కంటే వేరుగా ఉండడానికి మహీంద్రా కంపెనీ ఏం చేసింది అంటే,బి-పిల్లర్‌పై ఉన్న ‘ఎర్త్ ఎడిషన్’ బ్యాడ్జ్‌తో పాటుగా శాటిన్ మ్యాట్ ఫినిషింగ్ తో కొత్త డెసర్ట్ ఫ్యూరీ ఎక్స్‌టీరియర్ కలర్ ని అందించింది. స్పెషల్ ఎడిషన్లో గుర్తించాల్సిన ఇతర అంశాలలో మ్యాట్ బ్లాక్ బ్యాడ్జెస్, సిల్వర్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ మరియు డోర్‌లు మరియు రియర్ ఫెండర్‌లపై డ్యూన్-ఇన్‌స్పైర్డ్ డీకాల్స్ వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా లోపల, అతి పెద్ద మార్పు ఏంటి అంటే, డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజ్ కలర్లో ఇంటీరియర్ థీమ్‌తో పాటుగా డ్యూయల్-టోన్ లెదరెట్ సీట్ అప్హోల్స్టరీని కలిగి ఉంది. ఇది డాష్‌బోర్డ్‌పై యూనిక్ విఐఎన్ ప్లేట్‌తో డోర్ ప్యానెల్స్, సెంటర్ కన్సోల్ మరియు ఏసీ వెంట్‌లపై బీజ్ యాక్సెంట్స్ పొందింది. ముఖ్యంగా, వేరియంట్ బేస్డ్ గా వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్లో ఎలాంటి ఇతర ఫీచర్లు జతచేయబడలేదు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్