- పెట్రోల్ మరియు డీజిల్ రెండు పవర్ ట్రెయిన్లలో లభ్యం
- ఎక్స్‌క్లూజివ్ గా అందించబడుతున్న మిడ్ నైట్ బ్లాక్ కలర్
ఇండియాలో మహీంద్రా కంపెనీ స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్ ని లాంచ్ చేయగా, వీటి ధరలు రూ.16.99 లక్షలు (ఎక్స్ షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. కొత్తగా వచ్చిన ఈ 3-వరుసల ఎస్‍యూవీని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో పొందవచ్చు.
Z6 కంటే ఎక్కువగా ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త వేరియంట్ Z8 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కంటే చవక ధరతో దాదాపు రూ. 1.65 లక్షలు తక్కువ ఖరీదులో లభిస్తుంది. ఎక్స్‌క్లూజివ్ గా మిడ్ నైట్ బ్లాక్ కలర్ లో అందించబడుతున్న ఈ Z8 సెలెక్ట్ వేరియంట్లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన డబుల్ బ్యారెల్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ వంటి అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఇంటీరియర్ పరంగా చూస్తే, టాటా సఫారీతో పోటీపడుతున్న ఈ మోడల్ క్యాబిన్ కాఫీ బ్లాక్ లెదరెట్ థీమ్ తో రాగా ఇందులో వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, 7-ఇంచ్ కలర్ టిఎఫ్ టి డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ అలెక్సా, సన్‌రూఫ్ మరియు 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫంక్షనాలిటీలతో అడ్రినాక్స్ కనెక్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
హుడ్ కింద, స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ ని పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. ఇందులోని 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 200bhp పవర్/380Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 172bhp పవర్/400Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు దీని ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో కాన్ఫిగర్ చేయవచ్చు.
లేటెస్ట్ గా లాంచ్ అయిన స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూం ధరలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
Z8 సెలెక్ట్ పెట్రోల్ ఎంటి | రూ. 16.99 లక్షలు |
Z8 సెలెక్ట్ పెట్రోల్ ఎటి | రూ. 18.49 లక్షలు |
Z8 సెలెక్ట్ డీజిల్ ఎంటి | రూ. 17.99 లక్షలు |
Z8 సెలెక్ట్ డీజిల్ ఎటి | రూ. 18.99 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్