- బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలో అత్యధిక ఓపెన్ బుకింగ్‌లను కలిగి ఉన్న స్కార్పియో
- నెలకు 16 వేల కొత్త బుకింగ్‌లను పొందుతున్న మహీంద్రా
మహీంద్రా ఫిబ్రవరి 2024 నెలలో తన ఓపెన్ బుకింగ్ నెంబర్లను వెల్లడించింది. స్కార్పియో లైనప్‌లో ఉన్న స్కార్పియో ఎన్ మరియు క్లాసిక్ వెర్షన్ ద్వారా, ఈ నెలలో అత్యధిక ఓపెన్ బుకింగ్‌లతో ఈ బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలో విక్రయాలను కొనసాగిస్తోంది.
ప్రస్తుతం, ఆటోమేకర్ తన మొత్తం రేంజ్ లో ఎస్‌యువిల పై దాదాపు 2,25,800 ఓపెన్ బుకింగ్‌లను పొందగా, వీటిలో స్కార్పియో పై మాత్రమే ఈ బ్రాండ్ 1.01 లక్షల ఓపెన్ బుకింగ్‌లను పొందింది. అంతేకాకుండా దీనికి అదనంగా, ఈ రెండు ఎస్‌యువిలపై ప్రతి నెలా 16 వేల కంటే ఎక్కువగా కొత్త బుకింగ్‌లను కార్ మేకర్ అందుకుంటూ కొనసాగుతుంది
మహీంద్రా స్కార్పియో ఎన్, Z2, Z4, Z6, Z8 మరియు Z8L అనే 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, దీని ధరలు రూ. 13.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అయ్యాయి. మరోవైపు, స్కార్పియో క్లాసిక్ 7 మరియు 9-సీట్స్ కాన్ఫిగరేషన్‌లలో రెండు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా, దీనిని రూ. 13.59 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
ఇతర వార్తలలో చూస్తే, స్కార్పియో యొక్క డీజిల్ వేరియంట్‌లు పెట్రోల్ వేరియంట్‌ల కంటే ఎక్కువ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీ జనవరి 2024లో 14,293 స్కార్పియో యూనిట్లను విక్రయించగా, వీటిలో పెట్రోల్ వేరియంట్ యొక్క 765 యూనిట్లతో పోలిస్తే డీజిల్ వేరియంట్‌లు 13,528 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప