- అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్
- అక్టోబర్‌లో తగ్గిన వెయిటింగ్ పీరియడ్
హ్యుందాయ్ వెర్నామార్చి 2023లో లాంచ్ అయిన తర్వాత మొదటిసారిగా డిస్కౌంట్‌లతో విక్రయిస్తోంది.ఈ మిడ్-సైజ్ సెడాన్ EX, S, SX మరియు SX (O)నాలుగు వేరియంట్‌లలో మరియు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఎంచుకున్న వేరియంట్ అధారంగా , రూ. 25,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఎంచుకున్న వేరియంట్ ని బట్టి క్యాష్ డిస్కౌంట్స్, కార్పొరేట్ బోనస్ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆధారపడి ఉంటాయి. ఆఫర్స్ పై మరిన్ని వివరాల కోసం దగ్గరలో ఉన్న హ్యుందాయ్- అధికారిక డీలర్లను సంప్రదించవచ్చు.
మెకానికల్‍గా, వెర్నా సెడాన్ పవర్డ్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. . మొదటిది113bhp మరియు 144Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అయితే, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి యూనిట్‌తో జత చేయబడింది. అంతేకాకుండా మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో సెగ్మెంట్-బెస్ట్ గా చెప్పబడే 158bhp మరియు 253Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
ఇటీవల,తాజాగాహ్యుందాయ్ వెర్నాపై వెయిటింగ్ పీరియడ్ 16 వారాల వరకు తగ్గింది.
అనువాదించిన వారు: రాజపుష్ప