- 7 వేరియంట్స్ లో లభ్యం
- రూ. 6.35 లక్షలు(ఎక్స్-షోరూం)తో ధరలు ప్రారంభం
తాజాగా ట్రెండింగ్ లో ఉన్న ఎస్‍యూవీ, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక లక్షకు పైగా బుకింగ్స్ రిజిస్టర్ చేసి మరొక మైల్ స్టోన్ ని సాధించింది. ఈ కొరియన్ ఎస్‍యూవీ జూలై 2023లో రూ. 6.35 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. తర్వాత, ఈ మోడల్ ఆగస్టు మరియు అక్టోబర్ 2023లో వరుసగా 50,000 మరియు 75,000 బుకింగ్స్ మైల్ స్టోన్ ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా నవంబర్ నెలలో ఒక లక్ష బుకింగ్స్ ను చాలా ఈజీగా చేరుకుంది.
మీరు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను EX, EX (O), S, S (O), SX, SX (O), మరియు SX (O) కనెక్ట్ అనే ఏడు వేరియంట్స్ లో పొందవచ్చు. ప్రస్తుతం హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరల రేంజ్ రూ. 6. 35 లక్షల నుండి రూ. 10 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఇందులోని మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, ఎక్స్‌టర్ యొక్క 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఏఎంటీ యూనిట్ తో జతచేయబడింది. ఈ మోటారును కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ లో కూడా పొందవచ్చు. దీని పవర్ అవుట్ పుట్ గురించి చెప్పాలంటే, 1.2 కప్పా మోటార్ పెట్రోల్ మోడ్ లో 82bhp మరియు 114Nm టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. ఇంకా, దీనిలోని సిఎన్‍జి వెర్షన్ 68bhp మరియు 95.2Nm పీక్ టార్కును జనరేట్ చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్