- 18-ఇంచ్ వీల్స్ తో వస్తున్న విండ్‍సర్ ఈవీ
- ఎంజి నుంచి అందించబడుతున్న మూడవ ఎలక్ట్రిక్ కారు
సెప్టెంబర్ 11వ తేదీన ఎంజి కంపెనీ విండ్‍సర్ఈవీని తీసుకువస్తుండగా, దాని కంటే ముందు అల్లాయ్ వీల్స్ డిజైన్ ని వెల్లడించింది. లాంచ్ కి కేవలం మరో వారం మాత్రమే మిగిలి ఉండగా, ఎంజి నుంచి వస్తున్న మూడవ ఈవీగా విండ్‍సర్నిలిచింది. విండ్‍సర్ కారులో అందించబడనున్న టాప్-స్పెక్ మోడల్ డైమండ్-కట్ డిజైన్ తో స్పోర్ట్ లుక్ కలిగి ఉన్న 18-ఇంచ్ వీల్స్ తో వస్తుంది. సెగ్మెంట్లోని ఏ ఇతర కారును చూసినా టైర్ డైమెన్షన్లు మాత్రం నిర్దిష్టంగా 215/55 R18 తో ఉంటాయి.
బ్రిటీష్ ఆటోమేకర్ ఇండియాలో తీసుకువస్తున్న దాని మూడవ ఈవీ టీజర్ ని రిలీజ్ చేయగా, అందులో కొంత వరకు కారు సిల్హౌట్ కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఇది ఎలా ఉంది అంటే, ఏరోగ్లైడ్ డిజైన్ ని కలిగి ఉంది. ఎంజి కంపెనీ ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్లలో విండ్‍సర్ రియర్ సీట్ల డిజైన్ ని వెల్లడించగా, ఇవి ఎలా ఉన్నాయి అంటే, విమానంలో బిజినెస్ క్లాస్ లో అందిస్తున్న 135-డిగ్రీలు వంపు తిరిగే సామర్థ్యం ఉన్న రిక్లైనింగ్ సీట్లలా ఉన్నాయి. అలాగే మరో టీజర్ లో ఎంజి ఆపరేటింగ్ సిస్టంతో 15-ఇంచ్ ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ని వెల్లడించగా, ప్రస్తుతం ఎంజి కంపెనీ దాని కార్లలో దీనిని అందిస్తుంది.
మొత్తంగా చూస్తే, విండ్‍సర్ ఈవీ కామెట్ మరియు ZS ఈవీ మధ్య పర్ఫెక్టుగా రానుంది. చెప్పాలంటే, కామెట్ కంటే ఎక్కువ ఫీచర్లతో మరియు ZS ఈవీ కంటే కొంచెం తక్కువ ఫీచర్లతో వస్తుంది. దీని ధర కూడా దాదాపుగా రూ.18 లక్షలు లోపు ఉండే అవకాశం ఉంది. సెగ్మెంట్లో రెండవ ఎంజి కారుగా విండ్‍సర్ వస్తుండగా, ఇది టాటా కర్వ్ ఈవీ, మారుతి eVX, హ్యుందాయ్ క్రెటా ఈవీ, కియా కారెన్స్ ఈవీ కార్లతో మరియు భవిష్యత్తులో హోండా, మహీంద్రా, మరియు టయోటా నుంచి వచ్చే మోడల్స్ తో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్