గత కొన్నేళ్ళుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానంతో పాటు రాజకీయ ప్రస్థానం గురించి కూడా మీ అందరికీ తెలిసిందే. తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ గ్యారేజీలో బెంజ్- ఆర్ క్లాస్350, మహీంద్రా స్కార్పియో, యోధా పికప్ ట్రక్, బెంజ్ మేబ్యాక్-ఎస్ క్లాస్560, రేంజ్ రోవర్ – స్పోర్ట్స్,టయోటా ల్యాండ్ క్రూజర్, టయోటా వెల్ ఫైర్, జీప్ వెహికిల్, రెండు మహీంద్రా స్కార్పియో ఎస్ 11 వంటి కార్లు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశాడు. ఎలక్షన్ అఫిడవిట్లో తనకు ఉన్న అప్పులతో పాటు ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. ఇందులో కార్ల కలెక్షన్ వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ తో ఉన్న ఆయా కార్ల పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మెర్సిడెస్ బెంజ్- ఆర్ క్లాస్350 - రూ.60.23 లక్షలు (ఎక్స్-షోరూం)
ప్రస్తుతం, మెర్సిడెస్ బెంజ్- ఆర్ క్లాస్350 లగ్జరీ మోడల్ రూ.60.23 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారును మీరుఇరిడియం సిల్వర్, క్రోమైట్ బ్లాక్, పల్లాడియం సిల్వర్ మరియు డైమండ్ వైట్ బ్రైట్ అనే నాలుగు కలర్లలో సొంతం చేసుకోవచ్చు. అయితే, వీటిలో కొన్ని కలర్లు స్పెసిఫిక్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. దీనిని మీరు పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లలో పొందవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్-ఎస్ క్లాస్560 – రూ. 2.73 కోట్లు (ఎక్స్-షోరూం)
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్-ఎస్ క్లాస్560 లగ్జరీ మోడల్ S 560 అనే ఒకేఒక్క వేరియంట్లో రాగా, దీని ధర రూ. 2.73 కోట్లు (ఎక్స్-షోరూం). దీనిని మీరు ఎమరాల్డ్ గ్రీన్, నాటిక్ బ్లూ, డిజైన్ డైమండ్ వైట్ బ్రైట్, ఒనిక్స్ బ్లాక్, అబ్సిడియన్ బ్లాక్, మోజావే సిల్వర్, గ్రాఫైట్ గ్రే అనే ఏడు కలర్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
టయోటా వెల్ ఫైర్ – రూ. 1.48 కోట్లు (ఎక్స్-షోరూం)
టయోటా వెల్ ఫైర్ కారు హై గ్రేడ్ మరియు విఐపి గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో రూ. 1.48 కోట్ల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ కారును మీరు బ్లాక్, ప్లాటినం మెటల్, ప్లాటినం వైట్ పెర్ల్ అనే మూడు కలర్లలో పొందవచ్చు. ఈ కారు లీటరుకు 19.28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా మరియు హిల్-అసిస్ట్ కంట్రోల్‌తో పాటు, వెల్‌ఫైర్ లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు హై బీమ్ అసిస్ట్ వంటి ఎడాస్(ఏడీఏఎస్) సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
జీప్ రాంగ్లర్ – రూ. 77.48 లక్షలు ( ఎక్స్-షోరూం)
జీప్ రాంగ్లర్ లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ అన్ లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వేరియంట్లలో రూ. 77.48 లక్షలు ( ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ రాంగ్లర్ కారును బ్రైట్ వైట్, గ్రానైట్ క్రిస్టల్, ఫైర్‌క్రాకర్ రెడ్, బ్లాక్ మరియు సర్జ్ గ్రీన్ వంటి 5 కలర్ల నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెకానికల్ గా, జీప్ రాంగ్లర్ 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 8-స్పీడ్ కన్వర్టర్ యూనిట్ తో జతచేయబడి వచ్చింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, టిపిఎంఎస్, మరియు లెవెల్-2 ఎడాస్ సూట్ (ఏడీఏఎస్) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే నేడే జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ కూడా లాంచ్ అయింది. దీని ధర 67.65 లక్షలు (ఎక్స్-షోరూం).
మహీంద్రా స్కార్పియో S11 – రూ. 17.06 లక్షలు (ఎక్స్-షోరూం)
మహీంద్రా స్కార్పియో కారు S మరియు S11 అనే రెండు వేరియంట్లలో రూ. 17.06 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ కారును మీరు ఎవరెస్ట్ వైట్, మాల్టన్ రెడ్ రేజ్, గెలాక్సీ గ్రే, స్టెల్త్ బ్లాక్, డైమండ్ వైట్ అనే 5 కలర్ల నుంచి ఎంచుకోవచ్చు. స్కార్పియో క్లాసిక్ 130bhp మరియు 300Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చింది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో జతచేయబడింది.