పరిచయం
టాటా ఫ్లాగ్‌షిప్ మూడు-వరుసల ఎస్‍యూవీ గత సంవత్సరం మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఒక పెద్ద అప్‍డేట్ ని పొందింది.ఈ అప్‌డేట్‌లో ఇది కొత్త ఫేస్ మరియు భారీగా అప్‌గ్రేడ్ చేయబడిన ఇంటీరియర్‌లను పొందింది. మేము దీన్ని మొదటిసారిగా అక్టోబర్ 2023లో డ్రైవ్ చేశాము. అదే విధంగా ఈసారి కూడా దాన్ని మరింత సమయం డ్రైవ్ చేశాము, ఆటోమేటిక్ వేరియంట్ రియల్ వరల్డ్ మైలేజీ మరియు ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందుకు తీసుకువచ్చాం.
రియల్ వరల్డ్ మైలేజీ
టాటా అధికారికంగా ఈ డీజిల్ ఏటీపవర్‌ట్రెయిన్ 14.08కెఎంపిఎల్మైలేజీని అందిస్తుందని నిర్ధారణ చేసింది. 50-లీటర్ ట్యాంక్‌తో, మీరు 704కిలోమీటర్ల ట్యాంక్-టు-ట్యాంక్ దూరాన్ని అందుకుంటారు. మేము చేసిన రియల్ వరల్డ్ టెస్టులలో, టాటా సఫారీ సిటీలో 10.97 కెఎంపిఎల్ మైలేజీని మరియు హైవేలపై 13.94 కెఎంపిఎల్ మైలేజీని అందించింది, సగటున చూస్తే దీని మైలేజీ 12.4 కెఎంపిఎల్ గా ఉంది.ఇది మాకు 620కిలోమీటర్ల ట్యాంక్-టు-ట్యాంక్ దూరాన్ని అందించింది, మా వరకు అయితే,ఇది పెద్ద లాంగ్ రేంజ్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ కారు “ది బెస్ట్” అని చెప్పవచ్చు.
కంపెనీ పేర్కొన్న మైలేజీ | 14.08 కి.మీ |
సిటీ (కార్‌వాలే టెస్ట్) | 10.97 కి.మీ |
హైవే (కార్‌వాలే టెస్ట్) | 13.94 కి.మీ |
ట్యాంక్ కెపాసిటీ | 50-లీటర్లు |
ఐడియల్ దూరం | 704 కి.మీ |
రియల్ వరల్డ్ దూరం | 620 కి.మీ |
స్పెసిఫికేషన్స్ మరియు వేరియంట్స్
ఇక ఇంజిన్ విషయం కొంత సందేహాన్ని కలిగించినా, టాటా 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 168bhp/350Nm టార్కునుఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేసి అందించబడుతుంది. ఇది స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్ వేరియంట్లలలో లేదా మనకు వివిధ కలర్లలో అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లు, స్మార్ట్ మరియు ప్యూర్ వెర్షన్లు ఏటీమరియు ఎంటి అనేరెండు ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం టాటా సఫారీ బేస్ వేరియంట్ ధర రూ. 16.19 లక్షలు ఉండగా, మరియు టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్