- టాటా పంచ్ నుంచి నిలిపివేయబడిన 10 వేరియంట్లు
- పంచ్ లో జతచేయబడిన 3 కొత్త వేరియంట్స్
టాటా మోటార్స్ పంచ్ యొక్క అన్ని వేరియంట్లలో మార్పులను అమలులోకి తీసుకువచ్చింది. ఈ కార్‌మేకర్ పంచ్ లో మూడు సరికొత్త వేరియంట్‌లను జత చేయగా, అదే సమయంలో, బి-ఎస్‌యువిల లైనప్ నుండి 10 వేరియంట్‌లను నిలిపివేసింది.
కామో అడ్వెంచర్ ఎంటి, కామో అడ్వెంచర్ రిథమ్ ఎంటి, కామో అడ్వెంచర్ ఎఎంటి, కామో అకాంప్లిష్డ్ ఎంటి, కామో అడ్వెంచర్ రిథమ్ ఎఎంటి, కామో అకాంప్లిష్డ్ డాజిల్ ఎంటి, కామో అకాంప్లిష్డ్ ఎఎంటి, మరియు కామో అకాంప్లిష్డ్ డాజిల్ ఎఎంటి,క్రియేటివ్ డ్యూయల్-టోన్, క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ ఎంటిడ్యూయల్-టోన్ అనే ఈ 10 వేరియంట్స్ టాటా పంచ్ లో ఇకపై అందుబాటులో ఉండవు.
టాటా మోటార్స్ పంచ్ లో జతచేసిన, క్రియేటివ్ఎంటి, క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ ఎంటి, మరియు క్రియేటివ్ ఎఎంటి, వేరియంట్‌ల ధర వరుసగా రూ. 8.85 లక్షలు, రూ. 9.60 లక్షలు, మరియు రూ. 9.45 లక్షలు, (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) గా ఉంది. అలాగే ఈ నెల ప్రారంభంలో, ఈ మోడల్ పై రూ. 17,000 వరకు ధరలు పెరిగాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప