- అందుబాటులో ఉన్న6 వేరియంట్స్ మరియు 7 కలర్ ఆప్షన్స్
- ప్రారంభ ధర రూ.20.49 లక్షలు
జీప్ ఇండియా , 16 సెప్టెంబర్, 2023న దేశంలో ఫేస్‌లిఫ్టెడ్ కంపాస్‌ను పరిచయం చేసింది.ఇప్పుడు తాజా అప్‌డేట్‌తో, ఎస్‌యూవీన్యూ 4x2 డీజిల్ ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్ న్యూ బ్లాక్ షార్క్ ఎడిషన్‌తో వస్తుంది. అప్ డేటెడ్ జీప్ కంపాస్ ప్రారంభ ధర రూ. 20.49 లక్షలుగా ఉంది, 2WD ఆటోమేటిక్ వెర్షన్ రూ. 23.99 లక్షలు, (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
భారత మార్కెట్ కోసం ఈ న్యూ డ్రైవ్‌ట్రైన్ ను ప్రత్యేకంగా డెవలప్ చేసి పరిచయం చేశారు. 2.0-లీటర్ డీజిల్ మోటార్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జతచేయబడి 168bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ న్యూ డ్రైవ్‌ట్రెయిన్ ఎంపికతో అప్‌డేట్ చేయబడిన జీప్ కంపాస్ 16.2కెఎంపిఎల్ ఇంధన సామర్థ్యాన్ని ఏఆర్ఏఐ-క్లెయిమ్ చేసే విధంగా రేట్ చేయబడింది. అంతేకాకుండా, ఈఎస్‌యూవీ కేవలం 9.8 సెకన్లలో 0 నుండి 100కెఎంపిఎల్ వేగాన్ని అందుకుంటుంది.
జీప్ కంపాస్ లైనప్‌లో స్పోర్ట్, లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్, బ్లాక్ షార్క్ మరియు మోడల్ ఎస్ వేరియంట్‌లు ఉన్నాయి. కస్టమర్‌లు పెరల్ వైట్, డైమండ్ బ్లాక్, టెక్నో మెటాలిక్ గ్రీన్, ఎక్సోటికా రెడ్, గ్రిజియో మాగ్నేసియో గ్రే, మినిమల్ గ్రే మరియు గెలాక్సీ బ్లూ వంటి 7 కలర్స్ లో జీప్ కంపాస్ ను పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప