- రూ.6.24 లక్షలతో స్విఫ్ట్ ధరలు ప్రారంభం
- వచ్చే నెలలో లాంచ్ కాబోతున్న కొత్త స్విఫ్ట్
మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యచ్ బ్యాక్ ధరలలో మార్పులు చేయగా, పెరిగిన ధరలు 12 ఏప్రిల్, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు మేము పెరిగిన ధరల పూర్తి లిస్టును కలిగి ఉన్నాము. ఎంచుకునే వేరియంట్ ని బట్టి ఈ మోడల్ పై రూ.25,000 వరకు ధర పెరిగింది.
మారుతి స్విఫ్ట్ నుంచి వచ్చిన VXi, VXi ఎఎంటి, మరియు VXi సిఎన్‍జి వెర్షన్లు ఒక్కోదానిపై సుమారుగా రూ. 15,000 వరకు ధరలు పెరగడంతో ఇప్పుడు ఈ వేరియంట్లు మరింత ప్రియం అయ్యాయి. ఇప్పుడు స్విఫ్ట్ మోడల్ అన్ని ఇతర వేరియంట్లపై ప్రస్తుత ధర కంటే రూ.25,000 ఎక్కువగా ధర పెరిగింది. ఇప్పుడు స్విఫ్ట్ నుంచి వచ్చిన బేస్ LXi వెర్షన్ ధర రూ.6.24 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, టాప్-స్పెక్ ZXi+ ఎఎంటి డ్యూయల్-టోన్ వెర్షన్ ధర రూ. 9.28 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంది.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జతచేయబడి వచ్చింది. ఈ మోడల్ నుంచి వచ్చిన మిడ్-స్పెక్ VXi వేరియంట్ సిఎన్‍జి వెర్షన్ లో అందించబడుతుంది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ మోడల్ ని 10 కలర్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ సంవత్సరంలో మారుతి కంపెనీ స్విఫ్ట్ పై ధరలను రెండవసారి పెంచగా, మొదటిసారిగా జనవరిలో రూ.5,000 వరకు ధరలను పెంచింది. అలాగే, మారుతి కంపెనీ న్యూ-జెన్ స్విఫ్ట్ ని దేశవ్యాప్తంగా వచ్చే నెలలో లాంచ్ చేయనుండగా, ఇప్పటికే న్యూ-జెన్ స్విఫ్ట్ మోడల్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్