- 30 జూలై – 1 నవంబర్ 2019లో తయారైన కార్లను రీకాల్ చేసిన కంపెనీ
- ఫ్యూయల్ పంపులోని ఓ భాగంలో సమస్యను గుర్తించిన మారుతి
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఫ్యూయల్ పంప్ మోటర్‌లోని ఓ భాగంలో సమస్య కారణంగా 2019 జూలై 30 మరియు నవంబర్ 1 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో కార్లను మరియు 4,190 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లనురీకాల్ చేసింది. ఒకవేళ మీరు బాలెనో లేదా వ్యాగన్ ఆర్ కారును ఉపయోగిస్తున్నట్లయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి.
ఫ్యూయల్ పంప్ మోటార్ భాగంలో లోపం ఉన్నట్టు సందేహాలు ఉన్నాయని చెప్పింది. ఇది చాలా సందర్భాల్లో ఇంజిన్ ఆగిపోయేందుకు లేదా ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలకు దారితీస్తుందని వివరించింది. అయితే కంపెనీ డీలర్ల నుంచి ఆ రెండు మోడళ్ల కస్టమర్లకు వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని కంపెనీ తెలిపింది. కారును చెక్ చేసి ఏదైనా సమస్య ఉంటే ఉచితంగానే సరిచేస్తామని చెప్పింది. ఇటీవల కాలంలో మారుతి కంపెనీ రీకాల్ చేసిన సందర్బాల్లో ఇదే అత్యధికమని మనం భావించవచ్చు.
ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ మార్చి నెలలో బాలెనో మరియు వ్యాగన్ ఆర్ కార్లపై వరుసగా రూ.57,000 మరియు రూ. 65,000 డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో కస్టమర్లకు అందించబడతాయి. అదే విధంగా ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు మాత్రమే అమలులో ఉంటాయి. అయితే, ఈ ఆఫర్లు వేరియంట్, కలర్, పవర్‌ట్రెయిన్, డీలర్‌షిప్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్