- ఈ సంవత్సరం చివరలో ప్రారంభంకానున్న eVX ఉత్పత్తి
- 2025 ప్రారంభంలో ధరలు వెల్లడి
2025లో లాంచ్ కానున్న eVX ప్రారంభానికి ముందే, ఇది మారుతి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆఫర్, eVX, ప్రస్తుతం పబ్లిక్ రోడ్లపై టెస్టింగ్ కొనసాగిస్తోంది. దీని కొత్త స్పై షాట్‌లలో కనిపిస్తున్న కొత్త ఫీచర్ ని చూస్తే క్రెటా ఈవీ- మరియు ఎలివేట్ ఈవీలతో -పోటీకి దారితీసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడవుతుంది .
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, eVX మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి అంతటా కప్పబడిటెస్ట్ మ్యూల్ ఫాసియాపై ఏడీఏఎస్ సెన్సార్‌ను కలిగి ఉంది. లాంచ్‌లో ఈ మోడల్ ఏడీఏఎస్ సూట్‌తో వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. కార్‌మేకర్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కారులో లెవల్-1 లేదా లెవెల్-2 సూట్‌ను అందిస్తుందో లేదో అనేది నిర్ధారణ కాలేదు.
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, eVX దాని ప్రీ-ప్రొడక్షన్ అవతార్‌లో టెస్టింగ్ కొనసాగిస్తూనే ఉంది, ఇందులోని పనిచేసే టెయిల్‌లైట్స్ ప్రధానమైనవి. ఇందులో స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, గన్‌మెటల్-కలర్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లైండ్-స్పాట్ మానిటర్లు, సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ మరియు రియర్ బంపర్-మౌంటెడ్ నెంబర్ ప్లేట్ హోల్డర్ వంటి మరిన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
eVX యొక్క అప్‌డేట్ వెర్షన్2023 జపనీస్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడింది, ఇది ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడిన కాన్సెప్ట్‌తో పోలిస్తే చిన్నచిన్న డిజైన్ మార్పులను కలిగి ఉంది, అలాగే ఈ కారు లోపలి భాగంలో కూడా ప్రత్యేకత పొందింది.
అనువాదించిన వారు: రాజపుష్ప