- నవంబర్ 1, 2023 వరకు 70,000 పైగా పెండింగ్ లో ఉన్న ఆర్డర్స్
- 6 నెలల వరకు పెరిగిన వెయిటింగ్ పీరియడ్
ప్రస్తుతం మహీంద్రా లైనప్ లో ఉన్న ఎక్స్‌యువి700 మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీలలో ఒకటిగా నిలిచింది. ఒక నెల నుంచి 6 నెలల రేంజ్ వెయిటింగ్ పీరియడ్ తో (వేరియంట్ ఆధారంగా) మహీంద్రా ఎస్‍యూవీని 5 లేదా 7 సీట్స్ కాన్ఫిగరేషన్ లో పొందవచ్చు. ఒకవేళ మీరు ఈ ఎక్స్‌యువి700ని కొనాలని భావిస్తే, మీకోసం టాప్ సిటీల్లో ఉన్న దీని ఆన్ రోడ్ ధరలను ప్రత్యేకంగా అందిస్తున్నాము.
సిటీ | ధరలు(ఆన్-రోడ్) |
హైదరాబాద్ | రూ. 17.51 - 33.10 లక్షలు |
విజయవాడ | రూ. 17.59 – 33.28 లక్షలు |
ఢిల్లీ | రూ. 16.57 - 31.68 లక్షలు |
ముంబై | రూ. 16.84 - 32.38 లక్షలు |
పూణే | రూ. 16.73 - 32.20 లక్షలు |
లక్నో | రూ. 16.61 - 31.11 లక్షలు |
ఇండోర్ | రూ. 16.51 - 32.54 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 15.68 - 29.91 లక్షలు |
బెంగుళూరు | రూ. 17.76 - 33.61 లక్షలు |
చెన్నై | రూ. 17.24 - 32.32 లక్షలు |
మహీంద్రా ఎక్స్‌యువి700లో కొత్త ఫీచర్స్ వచ్చే అవకాశం
ప్రస్తుతం, లీకైన డాక్యుమెంట్ ప్రకారం, ఎక్స్‌యువి700 రెండు కొత్త ఫీచర్స్ తో తీసుకురావచ్చు అని భావిస్తున్నాం. అవి ఏవి అంటే, ఆటో-డిమ్మింగ్ ఐఆర్ వి ఎం మరియు రెండవ వరుసలో కెప్టెన్ సీట్స్. వీటి గురించి ప్రస్తుతం మహీంద్రా నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా, త్వరలో అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి, మహీంద్రా కంపెనీ వద్ద 2.86 లక్షలకు పైగా ఆర్డర్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా, రానున్న కొన్ని నెలల్లో కారు మానుఫ్యాక్చరర్ 70,000 ఎక్స్‌యువి700లను కస్టమర్లకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్