- మూడు ఇంజిన్లతో అందించబడిన కొత్త XUV 3XO
- పనోరమిక్ సన్ రూఫ్ మరియు లెవెల్-2 ఎడాస్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్స్ దీని సొంతం
మహీంద్రా కంపెనీ ఇండియాలో XUV 3XO ని లాంచ్ చేయగా,రూ.7.49 లక్షల నుండి దీని ధరలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభమయ్యాయి. XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అయిన ఈ మోడల్‌ను మే 15 నుండి బుక్ చేసుకోవచ్చు. అయితే, వీటి డెలివరీ మే 26 నుండి ప్రారంభంకానుంది.
కొత్త XUV 3XO 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ మోటార్ 109bhp మరియు 200Nm ఉత్పత్తి చేస్తుండగా, టిజిడిఐ వెర్షన్ 129bhp మరియు 230Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, డీజిల్ మోటార్ 115bhp మరియు 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఎఎంటి యూనిట్ మరియు కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. వెర్షన్-వారీగా ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ మైలేజీ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
వెర్షన్ | మైలేజీ (ఒక లీటరుకు) |
XUV 3XO 1.2 టర్బో-పెట్రోల్ ఎంటి | 18.89 కెఎంపిఎల్ |
XUV 3XO 1.2 టర్బో-పెట్రోల్ ఎటి | 17.96కెఎంపిఎల్ |
XUV 3XO 1.2 టిజిడిఐ టర్బో-పెట్రోల్ ఎంటి | 20.10కెఎంపిఎల్ |
XUV 3XO 1.2 టిజిడిఐ టర్బో-పెట్రోల్ ఎటి | 18.20కెఎంపిఎల్ |
XUV 3XO 1.5 డీజిల్ ఎంటి | 20.60కెఎంపిఎల్ |
XUV 3XO 1.5 డీజిల్ ఎఎంటి | 21.20కెఎంపిఎల్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్