- రూ. 6.40 లక్షలు తగ్గిన ధరలు
- పెట్రోల్ మరియు డీజిల్ రెండింట్లో లభిస్తున్న మోడల్
జెఎల్ఆర్ ఇండియా ఫేస్‌లిఫ్టెడ్ వేలార్‌ను జూలై 2023లో ఇండియాలో రూ. 94.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఆటోమేకర్ ఈ లగ్జరీ ఎస్‌యువిపై రూ. 6.40 లక్షలు వరకు ధరలు తగ్గడంతో, దీని కొత్త ధర రూ. 87,90,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో ఒకే ఒక్క పూర్తిగా లోడ్ చేయబడిన వేరియంట్‌లో అందుబాటులో ఉండగా, వేలార్ ఫేస్‌లిఫ్ట్ రేంజ్ రోవర్ ఎవోక్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్‌ల మధ్య ఉంటుంది. అప్‌డేట్ ఫీచర్ల విషయానికి వస్తే, వేలార్ లో సరికొత్త న్యూ పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్వీక్డ్ బంపర్స్ మరియు ఫ్రంట్ గ్రిల్, ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్స్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో కూడిన కొత్త 11.4-ఇంచ్ కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, యాక్టివ్ రోడ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఉన్నాయి.
కింది భాగంలో, ఫేస్‌లిఫ్టెడ్ వేలార్2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో ఉండగా, మునుపటిది 201bhp మరియు 430Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 296bhp మరియు 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్మిషన్ విధులు ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి, ఇది బ్రాండ్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్ ద్వారా నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప