- 0.5 శాతం మేర పెరగనున్న ధరలు
- ధరల పెంపులో భాగంగా జీప్ కంపాస్, మెరిడియన్ కార్ల ధరలలో మార్పులు
స్టెలాంటిస్ ఇండియా అనే కంపెనీ జీప్ మరియు సిట్రోన్ బ్రాండ్లను సొంతం చేసుకోగా, ఇప్పుడు ఈ రెండు బ్రాండ్ల ధరలలో 30 ఏప్రిల్, 2024 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. సిట్రోన్ నుంచి వచ్చిన అన్ని మోడల్స్ ధరలలో మార్పులు జరగనుండగా, జీప్ బ్రాండ్ నుంచి వచ్చిన కంపాస్ మరియు మెరిడియన్ కార్ల ధరలు మాత్రమే పెరగనున్నాయి.
ఈ రెండు బ్రాండ్ల నుంచి వచ్చిన మోడల్స్ పై 0.5 శాతం మేర ధరలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సగటున చూస్తే, అన్ని మోడల్స్ ధరలు రూ.4,000 నుంచి రూ.17,000 వరకు పెరగనున్నాయి. ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇన్ పుట్ ఖర్చులు మరియు ఆపరేషనల్ ఖర్చులేనని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం, సిట్రోన్ ఇండియా C3, eC3, C3 ఎయిర్ క్రాస్, మరియు C5ఎయిర్ క్రాస్ వంటి నాలుగు మోడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తుంది. మరోవైపు, జీప్ బ్రాండ్ నుంచి కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీ, మరియు రాంగ్లర్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఇతర వార్తలలో చూస్తే, జీప్ ఇండియా రాంగ్లర్ ఫేస్‍లిఫ్ట్ ని త్వరలో ఇండియాలో లాంచ్ చేయనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్