- 3 వేరియంట్స్ లో కస్టమర్లకు అందుబాటులోకి
- రూ.25000/- బుకింగ్ అమౌంట్ తో బుక్ చేసుకునే అవకాశం
ఫ్రెంచ్ ఆటో మేకర్ అయిన సిట్రోన్ మిడ్ సైజ్ ఎస్‍యువి C3 ఎయిర్ క్రాస్ బుకింగ్స్ ను ప్రారంభించింది. హ్యుందాయ్ క్రెటాకు ధీటుగా ఉన్న ఈ ఎస్ యు విని కస్టమర్లు రూ 25,000/- బుకింగ్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 9.99లక్షలతో ప్రారంభమవుతుందని, అదే విధంగా వీటి డెలివరీని పండుగ సీజన్ సందర్భంగా వచ్చే నెల అక్టోబరు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తమ ప్రకటనలో వెల్లడించింది.
సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. యూ, ప్లస్ మరియు మ్యాక్స్ వేరియంట్స్ లో 5 మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‍తో రానుంది. అలాగే ఇది పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, పోలార్ వైట్ విత్ ప్లాటినం గ్రే రూఫ్, పోలార్ వైట్ విత్ కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, స్టీల్ గ్రే విత్ కాస్మో బ్లూ రూఫ్, ప్లాటినం గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్ మరియు కాస్మో బ్లూ విత్ పోలార్ వైట్ రూఫ్ వంటి 10 కలర్స్ లో అందుబాటులో ఉంది.
ఫీచర్స్ పరంగా చూస్తే, సిట్రోన్ లేటెస్ట్ ఎస్ యు వి 10- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం, టిపిఎం, వాషర్ తో పాటు రేర్ వైపర్, రేర్ డీఫాగర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రూఫ్- మౌంటెడ్ రేర్ ఎయిర్ కాన్ వెంట్స్ మరియు మాన్యువల్ ఐవీఆర్ఎం వంటి అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంది.
పవర్ ట్రెయిన్ పరంగా చూస్తే, C3 ఎయిర్ క్రాస్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ని కలిగి ఉంది. అలాగే ఇది 109bhp మరియు 190Nm టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడి ఉంది. మేము డ్రైవ్ చేసిన ఈ ఎస్ యు వి రివ్యూను చూడడానికి మీరు మా వెబ్ సైట్ మరియు మా యూట్యూబ్ ఛానెల్ ను సందర్శించగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్