- అందుబాటులో ఉండనున్న 2 వేరియంట్స్
- రూ. 25,000 టోకెన్ అమౌంట్ తో మొదలైన సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ బుకింగ్స్
C3 ఎయిర్‌క్రాస్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు రేపే, (అనగా) జనవరి 29న దేశం అంతటా ప్రకటించడానికి సిట్రోన్ ఇండియా సిద్ధంగా ఉంది. ఈ మూడు-వరుసల ఎస్యువి, మ్యాక్స్ మరియు ప్లస్ అనేరెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా,వీటి బుకింగ్‌లు కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్ తో మొదలయ్యాయి. ఇప్పటికే మేము ఈ కార్ ని డ్రైవ్ చేసాము. దీని తొలిసారి డ్రైవ్ రివ్యూ రేపు, 29 జనవరి ఉదయం 11.00 గంటలకు పబ్లిష్ చేయనున్నాము .
డిజైన్ పరంగా, మాన్యువల్ వేరియంట్ తో పోల్చి చూస్తే సిట్రోన్ ఆటోమేటిక్ వేరియంట్లో ఎలాంటి మార్పులు కనిపించవు. అంతేకాకుండా, ఇందులో క్యాబిన్ మరియు ఫీచర్ లిస్ట్ కూడా ఒకేలా కనిపించగా, ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.2-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్లు మరియు మూడవ వరుసలో ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్ తో మీ ముందుకు రాబోతుంది.
సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్ లో 1.2-లీటర్ టర్బో-ఛార్జ్డ్ ఇంజిన్, 3- సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత జతచేయబడి 109bhp మరియు 205Nm మాక్సిమం టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేస్తూ ముందు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
లాంచ్ తర్వాత, C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు ఎంజి ఆస్టర్ వంటి ఆటోమేటిక్ వేరియంట్లతో పోటీ పడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప