- కేవలం 3.8 సెకన్లలో 0-100కి.మీ. రేంజ్ దీని సొంతం
- 516కి.మీ వరకు క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తున్న మోడల్
బిఎమ్‌డబ్ల్యూ ఇండియాలో సరికొత్త, మొట్టమొదటి సారిగా i5ని రేంజ్-టాపింగ్ ఎం60 ఎక్స్‌డ్రైవ్ వెర్షన్లో లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ 5 సిరీస్ రూ. 1,19,50,000 (ఎక్స్-షోరూమ్) ధరతో సిబియు రూట్ లో ఇండియాకు వచ్చింది.కొత్త-జెన్ 5 సిరీస్ కన్వెన్షనల్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్ట్రెయిన్ని త్వరలో పొందనుంది.
i5 M60 ఎక్స్‌డ్రైవ్ 4 బిఎండబ్ల్యూ ఇండివిజువల్ పెయింట్‌వర్క్ ఆప్షన్ లో కాకుండా 8 కలర్ ఆప్షన్స్ లో ఈ రోజు నుండి అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ఇంటీరియర్ వేరియంట్ కార్బన్ ఫైబర్‌లో మరియు అప్హోల్స్టరీ ఆప్షన్స్ లో అల్కాంటారా ఉన్నాయి. వెగాంజ మరియు మెరినో లెదర్ అప్హోల్స్టరీ అప్‌గ్రేడ్‌లుగా అందుబాటులో ఉన్నాయి.
బిఎండబ్ల్యూలో క్లేర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా వచ్చిన, i5 మోడల్ ఇల్యూమినేటెడ్ ఫ్రంట్ కిడ్నీ గ్రిల్ మరియు అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కొత్త డిజైన్ ని పొందుతుంది.ఇది హై-గ్లోస్ బ్లాక్, 20-ఇంచ్ M లైట్ అల్లాయ్ వీల్స్‌పై కూడా రైడ్ చేస్తుంది. M60 అత్యంత స్పోర్టియస్ట్ వేరియంట్ ని బిఎండబ్ల్యూ అందించగా, పెద్ద ఫ్రంట్ ఎయిర్ ఇన్టేక్స్, ఫ్లేర్డ్ సైడ్ స్కర్ట్స్, వెనుకవైపు డిఫ్యూజర్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ మరియు హై-గ్లోస్ ఇన్సర్ట్లతో కూడిన స్టాండర్డ్ M స్పోర్ట్ ప్రో ప్యాకేజీని కూడా పొందింది.
లోపలి భాగంలో చూస్తే, కొత్త బిఎండబ్ల్యూకాక్పిట్ లేఅవుట్ స్టాండర్డ్ గా తాజా OS8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, కార్బన్ ఫైబర్ వేరియంట్స్ లో ఫుల్-సైజ్ గ్లాస్ రూఫ్‌తో పాటు, 18-స్పీకర్ 655-వాట్ బోవర్స్ మరియు విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, M- స్పెసిఫిక్ లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్స్ మరియు సరికొత్త ఇన్-కార్ గేమింగ్స్ తో ఎయిర్కన్సోల్ కూడా కనిపిస్తాయి. హార్డ్‌వేర్ పరంగా చూస్తే, ఇది హెడ్స్-అప్ డిస్ప్లే, ఎంఐడి, ఏడీఏఎస్(ఎడాస్) సూట్ తో అనుసంధానించబడిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ షాక్ అబ్జార్బర్లతో అడాప్టివ్ సస్పెన్షన్, ఇంటిగ్రల్ యాక్టివ్ స్టీరింగ్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్ ను కూడా పొందుతుంది.
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే , ఎడబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌ను అనుమతించే ట్విన్ మోటార్ సెటప్‌తో 81.2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది.మోటార్ల నుండి కలిపి 600bhp మరియు 795Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 0-100కెఎంపిహెచ్ వేగాన్ని కేవలం 3.8 సెకన్లలో అందుకుంటుండగా, ఎలక్ట్రానిక్ క్లాక్డ్ 230కెఎంపిహెచ్ వేగం దీని సొంతం. అలాగే క్లెయిమ్ చేయబడిన రేంజ్ 516కి.మీ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
మెర్సిడెస్-బెంజ్ EQE సెడాన్ వచ్చే వరకు i5కి ఇండియాలో ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఏ మోడల్ కూడా లేదు.
అనువాదించిన వారు: రాజపుష్ప