- మొత్తం 1.75 లక్షల యూనిట్ల ఆర్డర్లను కలిగి ఉన్న ఉన్న మారుతి
- అత్యధిక సంఖ్యలను నమోదు చేసిన ఎర్టిగా, బ్రెజా, డిజైర్ మరియు వ్యాగన్ ఆర్
మారుతి సుజుకి మే 2024 నాటికి భారీ సంఖ్యలో ఆర్డర్లను పొందింది. ఆటోమేకర్ ప్రస్తుతం సుమారు 1.75 లక్షల యూనిట్ల ఓపెన్ ఆర్డర్లను పొందింది.ఇప్పుడు, మారుతి సుజుకి మోడల్ వారీగా సంఖ్యలను మనం నిశితంగా పరిశీలిద్దాం.
మే 2024 నాటికి, మారుతి ఎర్టిగా కారు ఒక్కటే 60,000 పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉండగా, దీని తర్వాత వరుసగా బ్రెజా 20,000 యూనిట్లు మరియు డిజైర్ 17,000 యూనిట్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. అదే సమయంలో, వ్యాగన్ ఆర్ 11,000 ఓపెన్ బుకింగ్స్ కలిగి ఉంది.
ముఖ్యంగా, గత నెలలో మారుతి దాని ప్రొడక్షన్ ని విస్తరించడంతో పెండింగ్ ఆర్డర్లు గణనీయంగా తగ్గాయి. అలాగే, మనేసర్ ప్లాంట్లో కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీని ఏడాదికి లక్ష యూనిట్లకు పెంచింది. మరోవైపు, మారుతి ఇప్పుడు ప్రతి సంవత్సరం 9 లక్షల వెహికల్స్ ను ఉత్పత్తి చేయగలదు.
అనువాదించిన వారు: రాజపుష్ప