- నాలుగు వేరియంట్లలో లభ్యం
- ఇప్పుడు రూ. 9.95 లక్షలతో ఎక్స్-షోరూం ధర ప్రారంభం
ఈ నెలలో మహీంద్రా ఇండియా బొలెరో నియో మోడల్ ధరలలో మార్పులు చేసింది. ఈ మూడు-వరుసల ఎస్యూవీపై రూ. 14,000 వరకు ధర పెరిగింది. ధర పెంపుతో, ఇప్పుడు మహీంద్రా బొలెరో నియో రూ. 9.95 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది.
మహీంద్రా బొలెరో నియో కారును N4, N8, N10, మరియు N10 (O) అనే నాలుగు వేరియంట్లలో పొందవచ్చు. అదే విధంగా, N10, మరియు N10 (O) వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా, మొదట పేర్కొన్న N4 మరియు N8 వేరియంట్లపై వరుసగా రూ. 5,000 మరియు రూ. 14,000 ధర పెరిగింది.
మెకానికల్ గా, బొలెరో నియో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. ఈ ఆయిల్ బర్నర్ మోటార్ 100bhp పవర్ మరియు 260Nm మాక్సిమం టార్కును జనరేట్ చేస్తుంది. అన్ని వేరియంట్లలో ఆర్డబ్లూడీ స్టాండర్డ్ గా రాగా, కస్టమర్లు మెరుగైన ఆఫ్-రోడింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఆస్వాదించడానికి N10 (O) వేరియంట్ మల్టీ-టెర్రైన్ టెక్నాలజీతో వచ్చింది.
ఇతర వార్తలలో చూస్తే, తాజాగా మహీంద్రా బొలెరో నియోపై నిర్వహించిన జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ఫలితాలను రిలీజ్ చేసింది, అందులో ఈ ఎస్యూవీ కేవలం ఒక్క స్టార్ ని మాత్రమే సాధించింది. ఓ రకంగా చూస్తే, సేఫ్టీ పరంగా అధిక రేటింగ్ సాధించడానికి బొలెరో నియోపై మహీంద్రా కంపెనీ ఎంతో శ్రమించాల్సి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్