![గ్లోబల్ మార్కెట్లలో కియా EV6 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ గ్లోబల్ మార్కెట్లలో కియా EV6 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ](https://imgd.aeplcdn.com/642x361/n/cw/ec/177117/kia-ev6-left-front-three-quarter3.jpeg?isig=0&q=80)
- అతిపెద్ద 84kWh బ్యాటరీ ప్యాక్ ని పొందిన కియా ఎలక్ట్రిక్ మోడల్
- ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లో సరికొత్త మార్పులను పొందిన EV6 ఫేస్‌లిఫ్ట్
కియా తన ఆల్-ఎలక్ట్రిక్ EV6 క్రాస్ఓవర్ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఈ మోడల్ ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ విభాగంలో కొన్ని ముఖ్యమైన మెరుగుదలతో పాటు కొన్ని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ సరికొత్త మార్పులను కూడా పొందింది.
![Kia EV6 లెఫ్ట్ ఫ్రంట్ త్రీ క్వార్టర్ Kia EV6 Left Front Three Quarter](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
బయటి వైపు, న్యూ EV6 ఫేస్‌లిఫ్ట్ బంపర్ మరియు స్లీకర్ ఒకే విధంగా ఉండే మార్పులను పొందుతుంది. అతి ప్రాముఖ్యమైన మార్పు ఏమిటంటే, ట్రయాంగిల్ -షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో సరికొత్తగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. మరో వైపు, ఇందులో అతిపెద్ద ప్రాముఖ్యమైన మార్పు ఏంటి అంటే, ఇది న్యూ ప్యాటర్న్డ్ తో కూడిన అల్లాయ్ వీల్స్ తో రాగా, దీనిని 19-ఇంచ్ మరియు 20-ఇంచ్ కాన్ఫిగరేషన్లలో ఎంచుకోవచ్చు.
![Kia EV6 కుడి వైపు వీక్షణ Kia EV6 Right Side View](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
ఇంకా చెప్పాలంటే, EV6 క్యాబిన్ ఇప్పుడు డిజిటల్ ఐఆర్విఎం, 12-ఇంచ్ హెడ్స్-అప్ డిస్ప్లే మరియు ఆఫ్-సెట్ కియా లోగోతో రీడిజైన్ చేయబడిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో అమర్చబడిన వీటిని మనం మరిన్ని రాబోయే(అప్ కమింగ్) కియా EVలలో చూస్తాము.
![కియా EV6 డాష్‌బోర్డ్ Kia EV6 Dashboard](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, కియా EV6 పెద్ద 84kWh యూనిట్‌ను పొందుతుంది, ఇది ఇంతకు ముందున్నఇటరేషన్ కంటే 6.6kWh యూనిట్ వరకు పెరిగింది. అలాగే మరోవైపు, ఈ బ్యాటరీ ప్యాక్ 350kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది, ఇది బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు చేయడానికి అనుమతిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప