- ఈ రోజు మాత్రమే చెల్లుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్
- అందుబాటులో పొడిగించిన వారంటీ మరియు మరిన్ని అదనపు బెనిఫిట్స్
స్కోడా ఆటో ఇండియా కొడియాక్‌పై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది మరియు ఈ డీల్ ఈరోజు (24 ఏప్రిల్, 2024) వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఆఫర్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది, కస్టమర్లు ఈ ఎస్‌యూవీని బుక్ చేయడం ద్వారా రూ. 40,000 భారీడిస్కౌంట్లను పొందవచ్చు. ఈ బుకింగ్ అమౌంట్ మొత్తం ఏప్రిల్ 30 వరకు పూర్తిగా మీకు తిరిగి చెల్లించబడుతుంది.
వెబ్సైట్ ప్రకారం, స్కోడా కొడియాక్ ఎల్&కె వేరియంట్ రూ. 2.40 లక్షలు డిస్కౌంట్ తో లభిస్తుంది. రూ. 39.99 లక్షల ధర (ఎక్స్-షోరూమ్)తో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అదనంగా, ఈరోజు కారును బుక్ చేసుకునే కస్టమర్లు కాంప్లిమెంటరీగా ఐదేళ్ల వరకు పొడిగించిన వారంటీ ప్యాక్ మరియు రెండేళ్ల సర్వీస్ మెయింటెనెన్స్ ప్యాకేజీ (ఎస్ఎంపి)ని కూడా అందుకుంటారు.
పైన పేర్కొన్న ఆఫర్ ఏప్రిల్ 24న ప్రతి గంటలో 24 నిమిషాల పాటు మాత్రమే వర్తిస్తుంది. బుకింగ్ పేజీలో చూస్తే ద్వారామూన్ వైట్, లావా బ్లూ మెటాలిక్, గ్రాఫైట్ గ్రే మరియు మ్యాజిక్ బ్లాక్ అనే 4 కలర్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. ఇంకా చెప్పాలంటే, ఈ కారును మీరు అప్డేటెడ్ 2023 మోడల్ మరియు 2024 మోడల్ నుంచి ఎంచుకోవచ్చు.
స్కోడా కొడియాక్ ఎల్&కె ఫీచర్ హైలైట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, 12-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్, 9 ఎయిర్‌బ్యాగ్స్, ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్, మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, హ్యాండ్స్-ఫ్రీ పార్క్ అసిస్ట్ మరియు డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ ఉన్నాయి.
స్కోడా కొడియాక్ పై అందించే డిస్కౌంట్ మరియు ఫ్రీబీలు(ఉచిత పథకాలు) వచ్చే నెలల్లో జరగబోయే న్యూ-జెన్ కొడియాక్ లాంచ్ కు ముందు ప్రస్తుత మోడల్ స్టాక్ ను క్లియర్ చేయడానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండోది అక్టోబర్ 2023లో వెల్లడైంది. అది ఏంటి అంటే, ఔరంగాబాద్‌లోని కార్‌మేకర్ ప్లాంట్‌లో కొత్త సూపర్బ్‌తో పాటుగా ఈ మోడల్ అసెంబుల్ చేయబడుతుందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప