- వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న కియా EV9
- మూడు బ్యాటరీ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్న EV9
ఈసారి USA న్యూయార్క్‌లో జరిగిన 2024 వరల్డ్ కార్ అవార్డ్స్‌లో ఎలక్ట్రిక్ కార్లు ఆధిపత్యం చెలాయించాయి, ఇందులో దక్షిణ కొరియా కార్ కంపెనీ కియా ఎలక్ట్రిక్ కార్ EV9 ఎస్యూవీ ఈ సంవత్సరం 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024' అవార్డును అందుకుంది. అలాగే, ఇది వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుంది, ఇది ఈ ఏడాది చివర్లో ఇండియాలో లాంచ్ కానుంది.
కియాతో పాటు హ్యుందాయ్, బిఎమ్‌డబ్ల్యూ, టయోటా, వోల్వో కూడా వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నాయి. EV కార్లు దాదాపు అన్ని విభాగాల్లో అవార్డులను సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల నుండి 100 మంది జ్యూరీ సభ్యులు ఆటో-షోలో పాల్గొన్నారు, 38 కార్లను టెస్ట్ చేసి రేటింగ్ ఇచ్చారు.
కియా EV9 మూడు బ్యాటరీ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఇందులో రియర్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన 76.1kWh బ్యాటరీ ప్యాక్, రియర్-వీల్ డ్రైవ్‌తో 99.8kWh బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు ఆల్-వీల్ డ్రైవ్‌తో కూడిన 99.8kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. దీని మాక్సిమం వేగం 185 కెఎంపిహెచ్ EV9 కేవలం 9.4 సెకన్లలో 0 నుండి 100 కెఎంపిహెచ్ వరకు వేగాన్ని అందుకోగలదు. దీని డ్రైవింగ్ రేంజ్ 541 కి.మీ. ఇది 800V అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది, కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేయడం వల్ల 239 కిమీల వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప