![ఇండియాలో రూ.7.45 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO; పనోరమిక్ స్కై రూఫ్ దీని ప్రత్యేకత ఇండియాలో రూ.7.45 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO; పనోరమిక్ స్కై రూఫ్ దీని ప్రత్యేకత](https://imgd.aeplcdn.com/642x361/n/cw/ec/175883/mahindra-xuv-3xo-right-front-three-quarter4.jpeg?isig=0&q=80)
- 11 వేరియంట్లలో అందించబడుతున్న 3XO మోడల్
- ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లతో, మెరుగైన పెర్ఫార్మెన్స్ దీని సొంతం
గత కొన్ని వారాలుగా మహీంద్రా కంపెనీ XUV 3XO మోడల్ కి సంబంధించిన టీజర్లను రిలీజ్ చేస్తూనే ఉంది. అయితే, మొత్తానికి దేశమంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న XUV 3XO కారును రూ.7.45 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో మహీంద్రా ఇండియాలో లాంచ్ చేసింది. క్రితం వచ్చిన XUV 300 కంటే ఈ అప్ డేటెడ్ XUV 300 కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లు మరియు టెక్, మెరుగైన పెర్ఫార్మెన్స్ తో అందించబడింది. మే 15వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం కానుండగా, ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ మోడల్ ని బుక్ చేసుకోవచ్చు. వీటి డెలివరీ మే 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
![Mahindra XUV 3XO Rear View Mahindra XUV 3XO Rear View](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
మహీంద్రా XUV 3XO మోడల్ ని మొత్తం 9 వేరియంట్లలో పొందవచ్చు. డిజైన్ పరంగా చెప్పాలంటే, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ ఉన్న సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, మెష్ ప్యాటర్న్ తో బ్లాక్డ్-అవుట్ గ్రిల్ మరియు రివైజ్డ్ ఫ్రంట్ బంపర్ ద్వారా ఈ ఎస్యూవీ ఫేస్ హైలైట్ చేయబడింది.
ఇక కారు వెనుక భాగం విషయానికి వస్తే, టాటా పంచ్ తో గట్టి పోటీని ఎదుర్కొంటున్న ఈ మోడల్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కనెక్ట్ చేసే ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్, టెయిల్‌గేట్‌పై కొత్తగా 'XUV 3XO' లెటర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ రెయిల్స్, వాషర్‌తో రియర్ వైపర్, రియర్ డీఫాగర్ మరియు రిఫ్లెక్టర్లతో విశాలమైన బంపర్ వంటి వాటిని పొందింది.
ఇంటీరియర్ పరంగా కారు లోపల చూస్తే, ఇంతకు ముందు వచ్చిన మోడల్ తో పోలిస్తే మరిన్ని మెరుగైన ఫీచర్లతో XUV 3XOవచ్చింది. XUV 400ని తలపించేలా 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ తో డ్యాష్ బోర్డు ఉంది.
![Mahindra XUV 3XO Infotainment System Mahindra XUV 3XO Infotainment System](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, XUV 3XOలో కొత్త స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, రియర్ ఏసీవెంట్స్ మరియు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ పనోరమిక్ సన్‌రూఫ్ (స్కై రూఫ్) వంటి ఫీచర్లను పొందింది.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, 4 డిస్క్ బ్రేక్స్, అన్ని సీట్లకు తప్పనిసరిగా 3-పాయింట్ సీట్ బెల్ట్, అన్ని సీట్లకు సీట్-బెల్ట్ రిమైండర్స్, చైల్డ్ సేఫ్టీ కోసం ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్-ఆఫ్ ఫీచర్, టాప్ టెదర్ తో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ వంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
![Mahindra XUV 3XO Rear View Mahindra XUV 3XO Rear View](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
మెకానికల్ గా, XUV 3XO మోడల్ పెట్రోల్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడింది. ఇందులో ట్రాన్స్మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
పవర్ ట్రెయిన్ | పవర్ అవుట్ పుట్ |
1.2-లీటర్ టర్బో-పెట్రోల్ | 109bhp/200Nm |
1.2-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్ | 129bhp/230Nm |
1.5-లీటర్ డీజిల్ | 115bhp/300Nm |
వేరియంట్-వారీగా ఆల్-న్యూ మహీంద్రా XUV 3XO ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
MX1 | రూ. 7.49 లక్షలు |
MX2 ప్రో | రూ. 8.99 లక్షలు |
MX2 ప్రో ఎటి | రూ.9.99 లక్షలు |
MX3 | రూ. 9.49 లక్షలు |
AX5 | రూ. 10.69 లక్షలు |
AX5L ఎంటి | రూ. 11.99 లక్షలు |
AX5L ఎటి | రూ. 13.49 లక్షలు |
AX7 | రూ. 12.49 లక్షలు |
AX7L | రూ. 13.99 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్